హరికుమార్‌ రాజు పర్యటన

ప్రజాశక్తి – భీమడోలు

ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండియా వేదిక తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న పి.హరికుమార్‌ రాజు బుధవారం భీమడోలులో పర్యటించారు. ఈ సందర్భంగా అప్పటి కాంగ్రెస్‌ నాయకులు, ప్రస్తుతం వివిధ పార్టీలలో ఉన్న ప్రముఖులు, పలువురు విశ్రాంత, ప్రస్తుత అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, సిపిఎం నాయకులు లింగరాజు, కట్టా భాస్కరరావు, జి.ప్రసాదరావు, ఎఫ్రాన్‌లను కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా చేపట్టనున్న కార్యాచరణ ప్రణాళికపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకులు యర్రంశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు.

➡️