సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

May 4,2024 14:34 #TDP
  • కూటమి టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారధి
    చాట్రాయి : గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని నూజివీడు ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లో ఆయన శనివారంనాడు ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటుచేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికలకు మరికొద్దిరోజులు మాత్రమే సమయం ఉన్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి ప్రజానీకంలోకి చొచ్చుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వ పాలన తీరు చాలా అప్రజాస్వామికంగా ఉందన్నారు. సక్రమ పాలన అందించాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమర్ధవంతమైన నాయకత్వ లక్షణాలు, సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం ఒక్క చంద్రబాబునాయుడుకే ఉందన్నారు. అందువల్ల ప్రజలంతా ఈ ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓట్లేసి తనను గెలిపించాలని కోరారు. వైసిపి నుంచి టిడిపిలోకి చేరికచాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ, చాట్రాయి మండలం మాజీ ఎంపీపీ, మాజీ సొసైటీ ప్రెసిడెంట్‌ చాట్రాతి రమాకాంత్‌ బెనర్జీతోపాటు మరో 20 కుటుంబాల వారు టిడిపిలో చేరారు. టిడిపి సీనియర్‌ నాయకులు నూతక్కి వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో నూజివీడు అసెంబ్లీ అభ్యర్థి కొలుసు పార్థసారధి సమక్షంలో టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా సారధి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి నూజివీడు గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షులు మందలపు రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గన్నారు.1
➡️