బైక్‌ను ఢీకొట్టిన బొలెరో – వ్యక్తి మృతి

May 18,2024 11:56 #Bolero collided, #man died

తర్లుపాడు (ప్రకాశం) : బొలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం తర్లుపాడు మండలంలో జరిగింది. తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం వద్ద బైకును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బేస్తవారిపేటకు చెందిన దూదేకుల సుభాని (34) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️