‘మానవత’ ఆధ్వర్యాన చలివేంద్రం ఏర్పాటు

భీమడోలు: అటు ప్రయాణికులు, ఇటు వాహనదారులతో పాటు పలువురు ప్రజలు సంచరించే భీమడోలు జంక్షన్‌ వంటి కీలక ప్రాంతాల్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ భీమడోలు మానవత శాఖ సేవలు అభినందనీయమని ఆ సంస్థ శాంతిరథాల విభాగం జిల్లా ఛైర్మన్‌ అప్పక రాంబాబు అన్నారు. భీమడోలు జంక్షన్‌లోని రూపక దేవాలయం ప్రాంతం వద్ద మానవత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ జిల్లా సమన్వయకర్త రామిశెట్టి గంగాధర రావు, భీమడోలు శాఖ ఛైర్మన్‌ జి.నూకరాజు మాట్లాడారు. మజ్జిగ సమకూర్చిన దాత గోనుగుంట రమణ శంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

➡️