సెంచూరియన్‌లో ముగిసిన బూట్‌ క్యాంప్‌

May 17,2024 20:44

ప్రజాశక్తి-నెల్లిమర్ల : సెంచూరియన్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న విద్యార్థులకు బూట్‌ క్యాంప్‌ నిర్వహించారు. దాదాపు నిర్విరామంగా 72 గంటలపాటు సాగిన ఈ బూట్‌ క్యాంప్‌లో 180 మంది విద్యార్థులు వివిధ అంశాలపై ప్రాజెక్టులు తయారు చేశారు. శుక్రవారంతో ముగిసిన ఈ కార్యక్రమంలో వెబ్‌ టెక్నాలజీస్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటా బేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లకు సంబంధించి ప్రాజెక్టులు తయారు చేశారు. వాటిలో గ్రీన్‌ హౌస్‌ ఆటోమేషన్‌, టెర్రయిన్‌ రికగ్నిషన్‌ యూజింగ్‌ డీప్‌ లెర్నింగ్‌, వేరబుల్‌ ఫిట్‌ నెస్‌ ట్రాకర్‌, ఆఫ్‌ లైన్‌ లాంగ్వేజీ ట్రాన్సలేటర్‌, కాఫీ కనెక్ట్‌, ప్లేస్‌మెంట్‌ డాష్‌ బోర్డు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్‌ ప్రశాంత కుమార్‌ మహంతి, రిజిస్ట్రార్‌ పల్లవి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.

➡️