పొన్నూరు సెగ్మెంట్లో పోలింగ్ కు సర్వం సిద్ధం

May 12,2024 16:12 #2024 election, #Guntur District
  • పోలింగ్ సామాగ్రీ భారీ పోలీస్ బందో బస్తుతో పోలింగ్ కేంద్రాలకు తరలింపు

ప్రజాశక్తి -పొన్నూరు : సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని సోమవారం జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు తమ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు పోలింగ్ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. స్థానిక సెయింట్ ఆన్స్ హై స్కూల్ లో పంపిణీ కేంద్రాల నుంచి సెక్టార్లవారీగా పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. పోలింగ్ కేంద్రాలలో ఉదయం ఐదున్నర గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరుగుతుందని పొన్నూరు సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీ కుమారి విలేకరులకు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదని ఆమె తెలిపారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు , హోమ్ ఓట్లు ప్రక్రియ పూర్తయిందని ఆమె పేర్కొన్నారు 264 పోలింగ్ కేంద్రాలకు 27 సెక్టార్లను ఏర్పాటు చేసి అధికారుల ద్వారా తరలించామని చెప్పారు. ఈ పోలింగ్లో పొన్నూరు నియోజకవర్గం ఓటర్లు 2,27,135 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనన్నారని ఆమె వివరించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు ఓట్లు నిర్భయంగా వేసేందుకు భారీ పోలీసు బందొ బస్తు ఏర్పాటు చేశామని చెప్పారు పోలింగ్ ప్రశాంతం జరిగేలా ప్రజలు సహకరించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు

➡️