వేరుశనగ సబ్సిడీ.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పరిశీలన

May 23,2024 17:03 #chitoor
  • నగరి సహాయ వ్యవసాయ సంచారకులు సౌభాగ్య లక్ష్మి

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు) : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వేరుశనగ సబ్సిడీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఎస్‌ఆర్‌ పురం మండలంలోని నెలవాయి, 49 కొత్తపల్లి మిట్ట రైతు భరోసా కేంద్రాల్లో గురువారం నగరి సహాయ వ్యవసాయ సంచారకులు సౌభాగ్య లక్ష్మి, ఎస్‌ఆర్‌ పురం వ్యవసాయ అధికారి నర్మదా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో వేరుశెనగ పంటలు వేసుకోవడానికి అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాలు గురువారం నుంచి రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆదివారం పాత్రికేయులతో మాట్లాడుతూ …రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఖరీఫ్‌ లో పంటలు వేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాలు కూడా తోడు కావడంతో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సాధారణంగా మన జిల్లాలో జూలై నెలలో వేరుశనగ, వరి పంటలు వేసుకోవడం జరుగుతుందని.. కానీ ఈ ఏడాది మే నెలలోనే వర్షాలు కురవడంతో వర్షాధారంగా సాగు అయిన వేరుశనగ పంటని జూన్‌ నెలలోనే వేసుకోవడానికి రైతులు సిద్ధపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివకుమార్‌ చక్కని ప్రియ ధనలక్ష్మి మునినాదయ్య నరేంద్ర రైతు భరోసా కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️