ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలకు కసరత్తు

ఉమ్మడి జిల్లాలోని పులివెందుల, మదనపల్లి నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల కార్యకలాపాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఒక వైపు పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచని వైద్య కళాశాలల భవనాలు, మిషనరీ, ల్యాబ్స్‌, మరోవైపు అరకొర ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది నియామకాల గందరగోళంపై సందిగ్ధత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ పులివెందుల మెడికల్‌ కళాశాలను ప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మెడికల్‌ కళాశాలల అడ్మిషన్లకు అనుమతి తెలపాలని కోరుతూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు లేఖ రాసిన నేపథ్యంలో కథనం…ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప, అన్నమయ్య జిల్లాల్లోని పులివెందుల, మదనపల్లి వైద్య కళాశాలల కార్యకలాపాల నిర్వహణకు కసరత్తు ఊపందుకుంది. 2019లో రూ.450 కోట్లతో పులివెందుల, రూ.వందల కోట్లతో మదనపల్లి వైద్య కళాశాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అనంతరం కరోనా విజృంభణతో వైద్య కళాశాల పనులు నిలిచిపోయాయి. కరోనా అనంతరం మూడేళ్లలో భవన నిర్మాణ పనుల్ని సుమారుగా పూర్తి చేయడం గమనార్హం. మొదటి సంవత్సర అడ్మిషన్లను దృష్టిలో ఉంచుకుని 90 శాతం మేరకు వైద్య కళాశాలల పనులు పూర్తి చేశారు. మిగిలిన పెండింగ్‌ పనుల్ని మరో రెండు ఫేజుల్లో పూర్తి చేయడంపై వైద్యకళాశాలల అధికార యంత్రాంగం నిమగమైంది. రిక్రూట్‌మెంట్‌ అరకొరే!నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రమాణాల మేరకు తరగతి గదులు, ఒటి, ల్యాబ్స్‌, లైబ్రరీ వంటి ఇతర సదుపాయాలను కలిగి ఉండాలి. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు కావడంతో ఎన్‌ఎంసి ప్రమాణాలను కలిగి ఉంటాయని చెప్పవచ్చు. వైద్యకళాశాలకు అవసర మైన మేరకు ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి వైద్య కళాశాలకు 222 మంది ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది కావాల్సి ఉండ గా 98 మంది మాత్రమే నియామకం చేయడం గమనార్హం. పులివె ందుల మెడికల్‌ కళాశా లకు 50 మంది ఫ్యాకల్టీని నియమించి ంది. మిగిలిన 72 మంది బోధనేతర సిబ్బ ంది నియా మకంలో గందరగోళం నెలకొ నడంతో వెర్ఫికేషన్‌ పేరుతో కాలయాపన కొనసాగుతోంది.కొనసాగుతున్న వెర్ఫికేషన్‌!సార్వత్రిక ఎన్నికల ముంగిట కడప, పులివెందుల మెడికల్‌ కళాశాలలకు సంబంధించి 198 మంది సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. రిక్రూట్‌మెంట్‌ చేయడంలో అనుభవజ్ఞుల సేవలు కొరవడిన నేపథ్యంలో ఫైనల్‌ లిస్టును విడుదల చేయడంలో గందరగోళం నెలకొంది. ఫలితంగా డిప్యూటీ సిఎం ఎస్‌బి.అంజాద్‌బాషా జోక్యం చేసుకోవడంతో కలెక్టర్‌ స్పందించి నలుగురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో వెర్ఫికేషన్‌ చేయించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో వెరిఫికేషన్‌ తంత్రం సాగుతూనే ఉండడం గమనార్హం.ఎన్‌ఎంసి తనిఖీ కోసం నిరీక్షణపులివెందుల, మదనపల్లి మెడికల్‌ కళాశాలల కార్యకలాపాలకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆమోదించాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 15 రోజుల కిందటే ఎన్‌ఎంసి పరిశీలన చేయాల్సి ఉంది. ప్రభుత్వం నూతన వైద్య కళాశాలల అడ్మిషన్లకు ఆమోదం తెలపాలని కోరుతూ లేఖ రాసింది. నెలాఖరులోపు ఎన్‌ఎంసి ఇన్‌స్పెక్షన్‌ చేసే అవకాశం ఉంది. నూతన కళాశాలల అధికార యంత్రాంగం నిరీక్షిస్తోంది. ఇన్‌స్పెక్షన్‌ అనంతరం ఎంఎన్‌సి చేసిన సిఫారసుల ఆధారంగా అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఆగస్టులోపు అడ్మిషన్లకు అనుమతి లభిస్తే సెప్టెంబర్‌లో తరగతుల నిర్వహించే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పులివెందుల వైద్య కళాశాలలో 100, మదనపల్లి వైద్య కళాశాలలో 150 మంది చొప్పున అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాతో ముందుకెళ్తుండడం గమనార్హం.ఎన్‌ఎంసి సిఫారసు తప్పనిసరి పులివెందుల, మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల కార్యకలాపాల నిర్వహణకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలపాలి. ఎప్పుడైనా నూతన వైద్య కళాశాలలను ఇన్‌స్పెక్షన్‌ చేయడానికి వచ్చే అవకాశం ఉంది. వైద్యకళాశాల నిర్వహణ కార్యకలాపాలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాం.డాక్టర్‌ శ్రీదేవి, ప్రిన్సిపల్‌, వైద్య కళాశాల, పులివెందుల.

➡️