పండ్ల తోటల పెంపకానికి రైతుల ఎంపిక

May 22,2024 21:33

 ప్రజాశక్తి-రేగిడి : గ్రామాల్లో పండ్ల తోటల పెంపకానికి చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేసి, నివేదికలు తయారు చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఎపిడి మీసాల శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు బుధవారం ఉపాధి కార్యాలయంలో సాంకేతిక, క్షేత్ర సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులు పండ్ల తోటల పెంపకానికి మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పండ్ల తోటల పెంపకంతో ఆర్థికంగా రైతులు బలోపేతం కావచ్చునని తెలిపారు. అన్ని పంచాయతీల్లో వేతనదారులందరికీ పనులు కల్పించాలన్నారు. రోజువారి కూలి రూ.300 వచ్చేవిధంగా కొలతలు ఇచ్చి పనిచేయించాలని తెలిపారు. మెట్టు పొలం ఉన్న సన్న, చిన్నకారు రైతులకు పండ్లతోటలు వేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. తోటలున్న రైతులకు కందకాలు, చెట్టు చుట్టూ చిన్ననీటి కుంటలు తవ్వుటకు అవకాశం ఉందని తెలిపారు. 90 రోజులు హౌసింగ్‌ పేమెంట్‌ చేయాలని సూచించారు. మేట్లు ప్రతిరోజూ ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ ద్వారా హాజరు పంపించాలని తెలిపారు. పనుల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎపిఒ హరినాథ్‌, ఇసి రామినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️