బాధితులకు రోటరీ క్లబ్‌వారి ఆర్థిక సాయం

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : తూర్పుతాళ్ళు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన బాధితులకు రోటరీ క్లబ్‌ వారు రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఇల్లు కట్టుకోవడానికి బుధవారం 30 బస్తాలు సిమెంటుకి పదివేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ గంగాబత్తుల సత్యవతి, కోట్ల రామకుమార్‌, కనకం వరప్రసాద్‌, బర్రి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️