పూర్వ మిత్రుల ఆర్థిక చేయూత

పూర్వ మిత్రుల ఆర్థిక చేయూత

ప్రజాశక్తి – పరవాడ: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ పోషణకు బాధపడుతున్న పూర్వ మిత్రుడికి స్థానిక జెడ్‌పి హైస్కూల్‌ 1993-94 టెన్త్‌బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. ఐదునెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ, పూర్వ విద్యార్థ్థి అనకాపల్లి నారాయణరావుకు ఇంటికే పరిమితమైన నేపథ్యంలో కుటుంబం పోషణ కష్టమైందన్న సమాచారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అతని సహచర మిత్రులు, పూర్వవిద్యార్థులంతా సోమవారం అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. తామంతా ఉండగా తమ పూర్వమిత్రుడు ఇబ్బంది పడకూడదని భరోసానిచ్చారు. వాట్సాప్‌గ్రూప్‌ అందరు మిత్రులతో కాంటాక్టు అయి, వారందరి ద్వారా సమీకరించిన రూ. 70 వేలను నారాయణరావు కుటుంబానికి అందజేశారు. కాసేపు మిత్రునితో కూర్చొని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. తామంతా అండగా ఉంటామని, ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. తనకష్టాన్ని తెలుసుకుని పరామర్శకు రావడమే కాకుండా, ఆర్థిక చేయూతనిచ్చిన పూర్వ మిత్రులకు నారాయణరావు కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.

నారాయణరావుకు సాయం అందిస్తున్న సహచర మిత్రులు

➡️