పాద ముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు

May 18,2024 19:29

ప్రజాశక్తి భోగాపురం : విమానాశ్రయం నిర్మాణ సమీపంలోని అనుమానస్పదంగా ఉన్న చిరుత పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు శనివారం ఉదయం పరిశీలించారు. చేపలకంచెరు పంచాయతీ దిబ్బల పాలెం సమీపంలో చిరుత పులిని చూసినట్లు ఇద్దరు యువకులు చెబుతున్నారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో పులుల సంచారం ఉండకపోవచ్చునని చెప్పారు. కానీ చిరుత పులి కచ్చితంగా పిల్లలతో కలిసి సంచరిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. పాద ముద్రలు కూడా చిరుత పులివేనని అంటున్నారు. అనుభవం ఉన్న అటవీ శాఖ అధికారులను పిలిపించి నిగ్గు తేల్చాలని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పులులకు సంబంధించిన కదలికలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు. చిరుత పులి వ్యవహారం చుట్టుప్రక్కల గ్రామాలకు తెలియడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.

➡️