నిరాశ్రయుల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం

Mar 13,2024 16:42 #Free medical camp, #Kurnool

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : మెప్మా వారి సహాయ సహకారాలతో, శ్రీరామ్ నగర్ నందు ఉన్న, నిరాశ్రయుల వసతి గృహం నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిధి గా డిప్యూటీ మేయర్ శిద్దారెడ్డి రేణుక రెడ్డి , మెప్మా పి .డి.నాగ శివలీల, టి పి ఆర్ ఓ వెంకటలక్ష్మీ, డాక్టర్ విద్య , సి ఎం ఎం మురళి గారు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ,ప్రాజెక్ట్ డైరెక్ట్ చేతుల మీదుగా వాటర్ డిస్పెన్సెర్ ఓపెనింగ్ చేయించడం జరిగినది. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రసన్న హెల్త్ మరియు ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారం తో నిరాశ్రయులకు బెడ్ షీట్స్ మరియు టవల్స్ ఇప్పించడం జరిగినది . ఈ కార్యక్రమం లో వైద్య బృందం వారు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ కార్య క్రమంలో టీఎంసీ విజయ భారతి , సుధాకర్, సి ఓ లు పాల్గొన్నారు.

➡️