అవకాశమివ్వండి అభివృద్ధి చేస్తా

May 1,2024 21:11

 ప్రజాశక్తి – పూసపాటిరేగ : ఎమ్మెల్యేగా తనకు అవకాశమిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి లోకం నాగమాధవి అన్నారు. బుధవారం మండలంలోని కొవ్వాడ, గొల్లపేట, పేరాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఉపాది హామీ పథకం పనులు జరుగుతున్న చెరువుల వద్దకు వెల్లి మహిళలతో మట్లాడారు. ఈ సందర్బంగా మీ ఆడబిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. గ్లాసుగుర్తుపై ఓటువేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు మాట్లాడుతూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు మనం మాదవమ్మను గెలిపించుకోవాలన్నారు. ప్రచారంలో టిడిపి మండల అధ్యక్షలు మహంతి శంకరావు, పిన్నింటి సన్యాసినాయుడు, నాయకులు ఆకిరి ప్రసాదరావు, జనసేన మండల అధ్యక్షలు జలపారి శివ, నాయకలు మహంతి శివ, పతివాడ శ్రీను, బాలా అప్పలరాజు, పులపా మల్లేశ్వరావు, నక్కాన రమణ, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️