అభివృద్ధి చేయటానికి ఒక్క అవకాశం ఇవ్వండి

May 3,2024 14:54 #indipendent
  • ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌ అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్‌

ఒంగోలు : స్థానికుడిగా ఒక్క అవకాశం తనకు ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేయటానికి అహర్నిశలు శ్రమిస్తానని ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌ అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్‌ అన్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు, కొండేపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నానన్నారు. కుండ గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని కోరారు. ప్రస్తుతం డబ్బు రాజకీయాలు నడుస్తుండటం బాధ కల్గిస్తోందన్నారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే సదుద్ధేశ్యంతో ఈ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నానన్నారు. గిద్దలూరు ప్రాంత వాసిగా ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ప్రజానీకానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నానన్నారు. నేస్తం ఫౌండేషన్‌ స్థాపించి ఎంతో మందికి సేవలు చేశానని వివరించారు.

➡️