పివి నరసింహారావు విగ్రహా ఆవిష్కరణ

Mar 7,2024 12:55 #Guntur District
Inauguration of PV Narasimha Rao statue

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరులో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహాన్ని మంత్రి విడదల రజని ఆవిష్కరణ చేశారు. గుంటూరు 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఛైర్మెన్ గా విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పి.వి.నరసింహారావు విగ్రహ ప్రారంభోత్సవంలో గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, డి.సి.సి.బి. చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

➡️