ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించడం గుప్తా గొప్పతనం

Apr 30,2024 21:58

ప్రజాశక్తి- విజయనగరం : ఎంతటి కష్టమైన పని చేసినా తన ముఖంలో ఎటువంటి ఒత్తిడీ కనబడకుండా చిరునవ్వుతో ఉద్యోగ బాధ్యతులు నిర్వహిం చడం గుప్తా గొప్పతనమని జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజా అన్నారు. పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన గుప్తా విరమణ సభ మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. సభకు ముఖ్య వ్వక్తలుగా పాలుగొన్న జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజా, విశాఖ జిల్లా పిఆర్‌ ఎస్‌ఇ రవీంద్ర, విశ్రాంతి పిఆర్‌ ఎస్‌ఇ కెఎమ్‌వి ప్రసాద్‌లు గుప్తా సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదర్శంగా పనిచేసిన ఆయన సేవలను తర్వాత తరం ఉద్యోగులు స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. మన్యం జిల్లా ఇంజినీరింగ్‌ అధికారి కృష్ణాజీ, ఎమ్‌విఎన్‌ వెంకటరావు, దివాకర్‌ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవారని, అన్నిటికి మించి ఆయన చాలా మంచివాడని కొనియాడారు. ఈఈ కెజీజె నాయడు, డిఈఈలు, ఎఇఇలు, కుటుంబ సభ్యులు, విశ్రాంతి ఉద్యోగలు, గుప్తాతో ఉన్న అనుభవాలను నెమరువేసుకున్నారు. అనంతరం గుప్తాను ఘనంగా సత్కారించారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ తాను ఉద్యోగ జీవితం సాఫిగా పూర్తి చేయాడానికి సహకరించిన పై అధికారులు, సహచర ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, గుప్తా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️