పాలెంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం

Mar 19,2024 16:41 #East Godavari

ప్రజాశక్తి- కడియం : మండలం లోని మాధవరాయుడు పాలెం గ్రామం శివారు చైతన్యనగర్ లో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంక్యాంప్ ఇంచార్జ్ డా.ఎన్.నాగసాయి మౌర్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ శిబిరంలో 263 మంది పేషెంట్ లకు అవసరమగు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. 22 మంది చిన్న పిల్లలు కూడా ఈ శిబిరంలో సేవలు పొందారు. 33 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కి ఒకరిని రిఫరల్ చేసారు. కడియం ఎంపిడిఓ జి. రాజ్ మనోజ్ వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. డా. ఎం.మణి జ్యోష్ణ, ఆర్ధోపీడీషియన్ డా. ఎ.గౌతమ్, కార్డియాలజిస్ట్ డా. కె. స్నేహ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ వి. సత్యప్రసాద్
వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️