జనసేనకు మద్దతుగా హైపర్‌ ఆది ప్రచారం

May 9,2024 21:05

 ప్రజాశక్తి – పాలకొండ/వీరఘట్టం : స్థానిక నియోజకవర్గ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది పట్టణంలో గురువారం ప్రచారం నిర్వహించారు. తొలుత స్థానిక కోటదుర్గమ్మ ఆలయం నుండి యాలాం జంక్షన్‌ వరకు జయకృష్ణతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 7 సార్లు కరెంటు ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెరగాలన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కళావతిని సైతం విడిచిపెట్టని హైపర్‌ ఆది కళావతి అనే పేరులో ఉన్న కళ ఇక్కడ రోడ్లలో కానీ మనుషుల్లో కానీ లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధి కావాలంటే జయకష్ణ, అవినీతి కావాలంటే కళావతి రెండే ఆప్షన్లు ఉన్నాయంటూ ఘాటుగా వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్యక్రమంలో జనసేన, టిడిపి, బిజెపి నేతలు పాల్గొన్నారు. అనంతరం వీరఘట్టం ప్రధాన రహదారిలో రోడ్‌షో నిర్వహించారు.

➡️