ముస్లిములకు ‘ఉగ్ర’ ఇఫ్తార్‌ విందు

ప్రజాశక్తి-కనిగిరి: రంజాన్‌ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం ముస్లిములకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. అమరావతి మైదానంలో జరిగిన ఇఫ్తార్‌ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లిములు హాజరై ఉపవాస దీక్షను విరమించి దువా చేశారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరే టిడిపి ప్రభుత్వం రావాలని ఉగ్ర ఆకాంక్షించారు. అనంతరం ఇఫ్తార్‌ విందులో ముస్లిములకు ఉగ్ర నరసింహారెడ్డి స్వయంగా వడ్డించి కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించారు.

➡️