ఉపాధి పనులు పరిశీలన

May 18,2024 20:31

 ప్రజాశక్తి- మెరకముడిదాం : మండలంలోని బైరిపురంలో జరుగుతున్న ఉపాధి పనులను జెఇ నరేంద్ర కుమార్‌ శనివారం పరిశీలించారు. గ్రామంలోని జగ్గమ్మ చెరువులో రూ.9.70లక్షలతో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులలో 27 గ్రూపులతో 296 మంది వేతనదారులు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా జెఇ ఆకస్మికంగా సందర్శించి పనులు పనితీరును, పనుల సమయంలో వేతన దారులకు తాగునీరు, మెడికల్‌ కిట్‌, ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి అందుబాటులో తార్ఫాన్లుతో కూడిన షెడ్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వేతనదారులకు అవి అందుబాటులో ఉండటం, వేతన దారులు కూడా వుంటున్నాయని చెప్పటం పనులు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వేతన దారులతో జెఇ నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ వేతన దారులు అందరూ ఉదయం 6 గంటలు నుంచి 11 గంటలు వరకు అదే విధంగా సాయంత్రం 4 గంటలు నుంచి 6గంటలు వరకు పనులు చేపట్టాలని, వడ దెబ్బకు గురి కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బూడు శ్రీనివాసరావు, వేతన దారులు పాల్గొన్నారు.

➡️