లీకేజీ పనుల పరిశీలన

ప్రజాశక్తి – కడప ప్రతినిధిబ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ లీకేజీ పరిశీలన కసరత్తు ఊపందుకుంది. గతంలో ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.52 కోట్లతో లీకేజీ నియంత్రణ పనులు చేపట్టింది. 100 మీటర్ల పరిధిలోని ఆనకట్ట లీకేజీ పనులను పోలవరం పనుల తరహాలో సిమెంట్‌ గ్రౌటింగ్‌ పనులు చేపట్టాల్సి ఉందని నిర్ధారించింది. మట్టికట్టలోని నిర్దేశిత ప్రాంతంలో సిమెంట్‌ గ్రౌటింగ్‌ ద్వారా లీకేజీని అరికట్టాలని నిర్ణయించింది. ఆనకట్టలోనికి 36 ప్యానళ్లను చొప్పించింది. ఇక్కడ నుంచి ప్యానళ్ల మధ్య అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్రౌటింగ్‌ పనులు చేప ట్టాల్సి ఉంది. 36 ప్యానళ్ల మధ్య చేప ట్టాల్సిన సిమెంట్‌ గ్రౌటింగ్‌ పనుల వ్యవ హారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వ ఆమోదం లభించిన అనంతరం రాష్ట్రంలోని సాగునీటి పారుదలశాఖ నిపుణుల సలహాలు, సూచనల సహా యంతో గ్రౌటింగ్‌ పనులను చేపట్టాలని నిర్ణయించింది. మట్టి కట్టలోని 200వ మీటరులో పలుచోట్ల నీటిచెమ్మ వెలువడుతున్నట్లు గుర్తించింది. త్వరలో జాతీ య స్థాయి నీటిపారుదల సంస్థ సిడబ్యుసీ, జాతీయ ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ నిప ుణుల బృందం రానుంది. నాలుగేళ్ల కిందట అన్నమయ్య రిజర్వాయర్‌ మట్టికట్ట తెగిన కారణంగా 32 గ్రామాల పరిధిలోని ఆరు గ్రామాలు ముంపునకుగురై 39 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి నిపుణుల బృందం సహాయంతో మట్టికట్టలోని ఎక్కడ నుంచి లీకేజీ అవుతోంది, ఎటువంటి నివారణ పద్ధతులు పాటించాలి, లీకేజీ గుర్తింపునకు అనుసరించాల్సిన పరీక్ష లేమిటనే అంశాలపై మేధోమధనం సాగిస్తోంది. జియో ఫెన్సింగ్‌, సీస్మిక్‌ పరీక్షల ద్వారా మట్టికట్ట లీకేజీని గుర్తించనుంది. జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం సూచనలు, సలహాల ఆధారంగా లీకేజీ నివారణ పనులు చేపట్టడంపై దృష్టి సారించింది.

➡️