రాజోలిని విస్మరించిన జగన్‌

ప్రజాశక్తి-చాపాడు/మైదుకూరు/ఖాజీపేటరాజోలి ప్రాజెక్టు ఏమైందో జగన్మో హన్‌రెడ్డి చెప్పాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజవకర్గంలోని మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట మండలాల్లో ప్రచారం నిర్వ హించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో తాగడానికి నీళ్లు కూడా లేవన్నారు. రాజోలి ప్రాజెక్టు ఏమైందో జగన్మోహన్‌రెడ్డి చెప్పాలన్నారు. వైఎస్‌ .రాజశేఖర్‌రెడ్డి ఉంటే ఈపాటికి పూర్తయ్యేదన్నారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారని ఒక ఎకరాకైనా నీళ్లుఇచ్చారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలో చెప్పాలన్నారు. జగన్‌ తన ఐదేళ్ల పాలనలో మట్టి, ఇసుక మాఫియాతో వనరులను కొళ్లగొడుతూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారన్నారు. ప్రాంతీయ పార్టీలైన వైసిపి, టిడిపి రెండూ దొందూ దొందేనన్నారు. జగన్‌, చంద్రబాబు ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ వద్ద మోకరిల్లుతున్నారని ఆరోపించారు. ఆ ఇద్దరు నాయకులు ఒకరిమీద మరొకరు తమ బలా బలాలను తాకట్టు పెట్టి వ్యక్తి గత స్వార్థ ప్రయో జనాల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గాని, పరిశ్రమలు గాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి గాని, పిల్లలకు ఉద్యోగాలు, పరిశ్రమలు, రాష్ట్ర రాజధాని ఏది లేకుండా మోడీ వైపు ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌ పదేళ్లలో దేనికోసమైనా పోరాడారా అనిప్రశ్నించారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి బిజెపి డబ్బులు ఇచ్చిందా అని చెప్పారు. పులివెందుల పులి అన్న జగన్‌ బిజెపి ముందు ఎందుకు మోకరిళ్లుతున్నాడని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పరిశ్రమలు వస్తాయన్నారు. మనకు రాజధాని లేదు గాని చేతిలో చిప్ప ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డి రైతులను తొక్కేస్తూ అప్పులపాలు చేస్తున్నాడని మండిపడ్డారు.ఇదేనా రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నిలబెట్టడం అంటే అని ప్రశ్నించారు. తన చిన్నాన్నను అతికిరాతకంగా నరికి చంపించిన అవినాష్‌రెడ్డికి కడప పార్లమెంటు టిక్కెట్‌ను జగన్‌ ఇచ్చారని తన సొంత చిన్నాన్నను హత్య చేసిన వారికి సీటు ఇస్తారా ఎవ్వరైనా మీరే ఆలోచించండన్నారు. జగన్‌ ఎలాంటి వాడో, గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో ఈ హత్యలు జరిగాయని ప్రశ్నించారు. ఈ హత్యా రాజకీయాలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెసు పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. రాజన్న బిడ్డను, మీ బిడ్డను కడప పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ తరపున పోటీ చేస్తున్నానని, నన్ను దీవించి నాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో రాజోలు ఆనకట్టను పూర్తి చేసి ఉంటే ఈపాటికి రైతుల సస్యశ్యామలంగా పంటలు పండేవన్నారు. బ్రహ్మసాగర్‌ కట్ట మరమ్మతులు చేయలేదని, పశుధానాలు ప్రారంభం చేయాలన్నారు. వనిపెంట ఇత్తడి పరిశ్రమను ప్రారంభించి నిధులు విడుదల చేసి అక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కెసి కెనాల్‌లో నీటి సుధీకరణ కోసం గుండ్రేవు రిజర్వాయర్‌ను నిర్మించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్‌ వైఎస్‌.సునీత, మైదుకూరు అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జి.శ్రీరాములు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్‌, సిపిఎం నాయకులు రాజేంద్ర, గండి సునీల్‌ కుమార్‌, గురయ్య, రవి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. చాపాడు దిలీప్‌ గ్యాస్‌ ఏజెన్సీ, ప్రొగ్రేషివ్‌ ఫౌండేషన్‌ అధినేత చాపాటి. రామసుధాకర్‌రెడ్డి, ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లవోలు రమణ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.వెంపర్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గాని, పరిశ్రమలు గాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి గాని, పిల్లలకు ఉద్యోగాలు, పరిశ్రమలు, రాష్ట్ర రాజధాని ఏది లేకుండా మోడీ వైపు ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌ పదేళ్లలో దేనికోసమైనా పోరాడారా అనిప్రశ్నించారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి బిజెపి డబ్బులు ఇచ్చిందా అని చెప్పారు. పులివెందుల పులి అన్న జగన్‌ బిజెపి ముందు ఎందుకు మోకరిళ్లుతున్నాడని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పరిశ్రమలు వస్తాయన్నారు. మనకు రాజధాని లేదు గాని చేతిలో చిప్ప ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డి రైతులను తొక్కేస్తూ అప్పులపాలు చేస్తున్నాడని మండిపడ్డారు.ఇదేనా రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నిలబెట్టడం అంటే అని ప్రశ్నించారు. తన చిన్నాన్నను అతికిరాతకంగా నరికి చంపించిన అవినాష్‌రెడ్డికి కడప పార్లమెంటు టిక్కెట్‌ను జగన్‌ ఇచ్చారని తన సొంత చిన్నాన్నను హత్య చేసిన వారికి సీటు ఇస్తారా ఎవ్వరైనా మీరే ఆలోచించండన్నారు. జగన్‌ ఎలాంటి వాడో, గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో ఈ హత్యలు జరిగాయని ప్రశ్నించారు. ఈ హత్యా రాజకీయాలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెసు పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. రాజన్న బిడ్డను, మీ బిడ్డను కడప పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ తరపున పోటీ చేస్తున్నానని, నన్ను దీవించి నాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో రాజోలు ఆనకట్టను పూర్తి చేసి ఉంటే ఈపాటికి రైతుల సస్యశ్యామలంగా పంటలు పండేవన్నారు. బ్రహ్మసాగర్‌ కట్ట మరమ్మతులు చేయలేదని, పశుధానాలు ప్రారంభం చేయాలన్నారు. వనిపెంట ఇత్తడి పరిశ్రమను ప్రారంభించి నిధులు విడుదల చేసి అక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కెసి కెనాల్‌లో నీటి సుధీకరణ కోసం గుండ్రేవు రిజర్వాయర్‌ను నిర్మించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్‌ వైఎస్‌.సునీత, మైదుకూరు అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జి.శ్రీరాములు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్‌, సిపిఎం నాయకులు రాజేంద్ర, గండి సునీల్‌ కుమార్‌, గురయ్య, రవి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. చాపాడు దిలీప్‌ గ్యాస్‌ ఏజెన్సీ, ప్రొగ్రేషివ్‌ ఫౌండేషన్‌ అధినేత చాపాటి. రామసుధాకర్‌రెడ్డి, ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లవోలు రమణ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️