కౌంటింగ్‌ సెంటర్‌ ఏర్పాట్లు పరిశీలించిన జెసి

Apr 28,2024 21:22

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ ఎస్‌ శోబిక ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఉద్యాన కళాశాలలో ఏర్పాట్లను చేస్తున్నారు. స్ట్రాంగ్‌ రూం లను, ఓట్ల లెక్కింపు గదులను, కంట్రోల్‌ రూం, మీడియాసెంటర్‌, ఏర్పాటు చేయాల్సిన వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించారు. వివిధ శాఖలకు కేటాయించిన పనుల పురోగతిని సమీక్షించారు. రెవెన్యూ, పోలీసు, రోడ్లు భవనాలు, విద్యుత్‌ శాఖ, పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖల అధికారులకు వారికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌, డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, పార్వతీపురం, కురుపాం ఆర్‌డిఒలు కె.హేమలత, వి.వెంకట రమణ, డిపిఒ బి.సత్యనారాయణ, ఆర్‌అండ్‌బి అధికారి ఎస్‌ వేణుగోపాలరావు, ఇపిడిసిఎల్‌ పి.త్రినాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️