2024 AP Elections- ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్‌

May 13,2024 10:30 #15, #2024, #Andhra Pradesh, #percent, #Polling

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్‌ నమోదయిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా యర్రగొండపాలెంలో కేవలం 5.2 శాతం మేర పోలింగ్‌ నమోదు అయినట్లు తెలిపారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న గురజాల, మాచర్ల, పుంగనూరుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్‌ జరిగినట్లు తెలిపారు. గురజాల 9.5 శాతం, మాచర్ల 0. 9 శాతం, పుంగనూరులో 15 శాతం మేర పోలింగ్‌ నమోదు అయిందని ఈసీ వివరించింది. తొలి రెండు గంటల్లో కేవలం 10 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

ఎపి వ్యాప్తంగా జిల్లాలవారీగా పోలింగ్‌ శాతం ఇదే..!
అల్లూరి- 6.77
అనకాపల్లి-8.37
అనంతపురం- 9.18
అన్నమయ్య- 9.89
బాపట్ల- 11.36
చిత్తూరు- 11.84
కోనసీమ- 10.42
తూర్పు గోదావరి- 8.68
ఏలూరు- 9.90
గుంటూరు- 6.17
కాకినాడ- 7.95
కఅష్ణా- 10.80
కర్నూలు- 9.34
కడప- 12.09
నంద్యాల- 10.32
నెల్లూరు- 8.95
పల్నాడు- 8.53
పశ్చిమగోదావరి- 9.57
పార్వతిపురం మన్యం- 6.30
ప్రకాశం- 9.14
శ్రీ సత్యసాయి- 6.92
శ్రీకాకుళం- 8.30
తిరుపతి- 8.11
విశాఖపట్నం- 10.24
విజయనగరం- 8.77

➡️