అవనిగడ్డలో జానీ మాస్టర్‌ ప్రచారం

Apr 27,2024 14:21 #pracharam

అవనిగడ్డ : ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ శనివారం అవనిగడ్డ విచ్చేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండలి బుద్ధప్రసాద్‌ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. జనసేన అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ విస్తఅత ప్రచారం చేస్తున్న జానీ మాస్టర్‌ జనసైనికులకు స్ఫూర్తిప్రదాత అని బుద్ధప్రసాద్‌ అన్నారు. అవనిగడ్డలో బుద్ధప్రసాద్‌ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గన్నారు. 

➡️