పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలి

Apr 1,2024 11:45 #Kadapa

పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి

ప్రజాశక్తి – వేంపల్లె : వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ప్రభుత్వాన్ని సూచించారు. సోమవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్షన్ దారులు సచివాలయం వద్దకు వచ్చి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అవమానీయం, చేత కానితనం అన్నారు. రాష్ట్రంలో సామాజిక పెన్షన్ దారులు 65,92100 లక్షల మంది ఉన్నట్లు చెప్పారు. సచివాలయ సిబ్బంది 1,35000 వేల మంది ఉన్నట్లు చెప్పారు. ఒక్కోక సచివాలయ సిబ్బంది 49 మంది పెన్షన్ దారులకు వారి ఇంటి వద్దనే పంపిణీ చేస్తే సరిపోతుందని చెప్పారు. బటన్ నోక్కడం ద్వారా పెన్షన్ దారుల బ్యాంకు ఖాతాలో పడే విధంగా చేయవచ్చు అన్నారు. కాబట్టి సచివాలయాల వద్దకే పెన్షన్ తీసుకోవాలనే నిబంధనలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ కు ఇడి డిమాండ్ నోటీసు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. నరేంద్ర మోఢీకి ఓటమి పట్టుకుందని చెప్పారు. అక్రమ మార్గాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని మోఢీ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెసుతో సహ ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలను దెబ్బ తీసి ప్రచార కార్యక్రమాలు చేసుకోకుండా కుట్ర చేస్తున్నట్లు చెప్పారు. ఆదాయ పన్ను శాఖను పని ముట్టుగా మోఢీ ఉపయోగిస్తున్ననట్లు చెప్పారు. ఇటీవల ఇడి కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 బ్యాంకు ఖాతాల్లో రూ 270 కోట్లు స్తంభింపజేయడమే కాకుండా అందులో నుండి రూ 135 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతటితో ఆగక రూ 1823 కోట్లు పెనాల్టీ, వడ్డి చెల్లించమని డిమాండ్ నోటీసులు ఇవ్వడం శోచనీయం అన్నారు. అది చాలక మళ్లీ రూ 1744 కోట్లు డిమాండ్ నోటీసు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే రాబోవు ఎన్నికల్లో బిజెపి పార్టీని ఓడించాలని తులసిరెడ్డి కోరారు.

➡️