మాతృ, శిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి-

డిఎంహెచ్‌ఒడాక్టర్‌ నాగరాజు
ప్రజాశక్తి – కడప అర్బన్‌
జిల్లాలో మాతృ,శిశుమర ణాలు ఉండకూడదని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రమాదకర గర్భిణుల సంరక్షణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నమోదవుతున్న ప్రమాదకర గర్భిణులకు ప్రత్యేకమైన సేవలు అందించాలని చెప్పారు. గర్భిణి ప్రసవ, బాలింత సమయంలో సరైన సేవలు అందించాలని తెలిపారు. గర్భ సమయంలో వచ్చే మధు మేహం, రక్త పోటు, రక్తహీనత, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందిం చాలని పేర్కొన్నారు. 108,102 వాహన సేవలు ఉపయోగించుకోవాలని చెప్పారు. అన్ని రకాల సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించాలని తెలిపారు. జిల్లా టీకాల అధికారి డాక్టర్‌ ఉమామహేశ్వర కుమార్‌ మాట్లాడుతూ శిక్షణలో అందిస్తున్న సమాచారం క్షుణ్ణంగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. పనిచేసే ప్రదేశంలో ప్రమాదకర గర్భిణులకు నాణ్యమైన సేవలందించాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్‌ పవన్‌, డాక్టర్‌ స్వాతి సాయి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️