ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన

Feb 15,2024 23:34
ఉద్యోగ, ఉపాధ్యాయుల

ప్రజాశక్తి – కాకినాడ

ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి జెఎసి పిలుపుమేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో చేసిన ధర్నాలో ఎపి జెఎసి జిల్లా అధ్యక్షులు గుద్దటి రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావలసిన ఎస్‌ఎల్‌, జిపిఎఫ్‌ లోన్స్‌, ఎపిజిఎల్‌ఐ, డిఎ బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని, అదే విధంగా 12వ పిఆర్‌సిలో 30 శాతం తగ్గకుండా వెంటనే మద్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి జెఎసి నాయకులు పేపకాయల వెంకటకృష్ణ, పాము శ్రీనివాస్‌, ఆర్‌వి.రమేష్‌, మోర్త శ్రీనివాస్‌, బి.మహేష్‌, కె.నగేష్‌, గోవింద రాజులు, తానీషా, గిరిధర్‌, మట్టపర్తి వెంకటేశ్వరరావు, సరెల్ల చంద్రరావు, కెవిఎస్‌వి.ప్రసాద్‌ పాల్గొన్నారు

➡️