ఎన్నికల కోసం హెల్ప్‌ లైన్‌ సెంటర్‌

Mar 20,2024 23:36
మే 13న జరగనున్న

ప్రజాశక్తి – కాకినాడ

మే 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు తెలిపారు. హెల్ప్‌ లైన్‌ సెంటర్‌ నిర్వహణపై బుధవారం ఆయన ఎన్నికల అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు 24 గంటలూ పనిచేసే మూడు షిఫ్ట్‌లలో 12 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సిటీ నియోజకవర్గ పరిధిలో ఏమైనా ఫిర్యాదులు ఉన్నా, సందేహాలు ఉన్నా హెల్ప్‌ లైన్‌ ఫోన్‌ నెంబర్‌ 0884-2349400కు సమాచారం అందజేయవచ్చునని ఆయన తెలిపారు

➡️