ఎన్నికల ప్రచారానికి దొరబాబు శ్రీకారం

Feb 19,2024 22:32
స్థానిక భీమేశ్వర స్వామి

ప్రజాశక్తి – సామర్లకోట

స్థానిక భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజ లు చేపట్టి పెద్దాపురం వైసిపి ఇన్‌ఛార్జ్‌ దవులూరి దొర బాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలుత ఆల యానికి వచ్చిన దొరబాబుకు కార్యనిర్వాహాక అధికారి నీలకంఠం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన భీమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ చందలాడ అనంత పద్మనాభం, డాక్టర్‌ సి.సన్యాసిరాజు, డాక్టర్‌ యార్లగడ్డ సత్యనారాయణ, డాక్టర్‌ పసల సత్యానందరావు, సెవెన్‌ హిల్స్‌ ఎండి పసల పద్మ రాఘవరావు, ఆర్యవైశ్య నాయకులు కటకం బాబు, కటకం సతీష్‌, రాంబాబు, గంగబాబు, చుండ్రు గోపాలకృష్ణ, దుద్దుంపూడి సాయి, గోలి కోటేశ్వరరావు వంటి ప్రముఖుల కుటుంబాలను దొరబాబు కలిసి ఎన్నికల్లో తన విజయానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ మాజీ కౌన్సిలర్‌ యండ్రు సాయి వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు దవులూరి సుబ్బారావు, మునిసిపల్‌ ఛైర్పర్సన్‌ గంగిరెడ్డి అరుణ, సామర్లకోట, పెద్దాపురం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు ఊబా జాన్‌మోసెస్‌, నెక్కంటి సాయిప్రసాద్‌, కౌన్సిలర్‌లు ఆవాల లక్ష్మి నారాయణ, సేపేని సురేష్‌, నేతల హరిబాబు, కో అప్సన్‌ సభ్యులు మన్యం చంద్రరావు, నాయకులు మోరంపూడి రంగ పాల్గొన్నారు.

➡️