ఏలేశ్వరం యువకుడు నారాయణకు డాక్టరేట్‌

Jan 24,2024 22:52
ఏలేశ్వరంకు చెందిన

ప్రజాశక్తి – ఏలేశ్వరం

ఏలేశ్వరంకు చెందిన కోన నారా యణ అనే యువకునికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ బూసి వెంకటస్వామి పర్యవేక్షణలో డాక్టర్‌ ఎంవిజె భువనేశ్వర్రావు కదా సాహిత్యం ”ఒక పరిశీలన”అనే అంశంపై కోన నారాయణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్‌ కళాశాలలో తెలుగు, ప్రాచ్య భాష విభాగానికి సమర్పించిన పరిశోధన సిద్ధాంత గ్రంథానికి గాను డాక్టర్‌ లభించినట్లు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ సెల్ఫ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.కిరణ్మయి తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో గుంటూరు ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళా శాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సిహెచ్‌ స్వరూప రాణి చేతుల మీదగా కోన నారాయణకు డాక్టరేట్‌ బహుకరించారు. ఎఎన్‌యు విసి ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.రాజశేఖర్‌, డాక్టర్‌ పి వరప్రసాద్‌ మూర్తి, తెలుగు విభాగపతి ప్రొఫెసర్‌ ఇ.మాధవి, తెలుగు పాఠ్య భాగసంగ అధ్య క్షులు ఎన్‌వి.కృష్ణారావు, అధ్యాపకులు, అధ్యా పకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు స్నేహితులు, బంధువులు, తదితరులు నారాయణను అభినందించారు.

➡️