టిడిపిలోకి 500 మంది వైసిపి నేతలు

Feb 2,2024 23:24
టిడిపిలోకి 500 మంది వైసిపి నేతలు

ప్రజాశక్తి-గండేపల్లిఉప్పలపాడులో వైసిపికి చెందిన సర్పంచ్‌ అడబాల రామాంజనేయులు, ఉప సర్పంచ్‌ రాయుడు జ్యోతి ఆధ్వర్యాన శుక్రవారం 500 మంది టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలలు వేసి స్వాగతం పలికారు. తొలుత జ్యోతుల నెహ్రూకు భారీ ఊరేగింపుగా నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ సర్పంచ్‌ అడబాల రామాంజనేయులు పార్టీలో చేరడం పార్టీ గెలుపునకు నాంది అన్నారు. వైసిపి హయాంలో పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్‌ మెంబర్లు ధారా వెంకటరమణ, జక్కంపూడి వెంకన్న, మేడు బోయిన అమ్మాజీ, మామిడాల పెద్దకాపు, కోర్పు లచ్చయ్య దొర, ఎస్‌విఎస్‌.అప్పలరాజు, పోతుల మోహనరావు, మారిశెట్టి భద్రం, అడబాల భాస్కరరావు, కందుల చిట్టిబాబు, కొత్త కొండబాబు, కోర్పు సాయి తేజ, అడబాల వెంకటేశ్వరరావు, జీను మణిబాబు, కందుల బాబ్జి, తమటం వీరభద్రరావు రావు, చావ నరసింహమూర్తి, అవసరాల బాలసుబ్రహ్మణ్యం, సుంకవిల్లి రాజు, బొల్లం రెడ్డి రామకృష్ణ, జోస్యుల రాంబాబు, దాపర్తి సీతారామయ్య, కుంచె రామకృష్ణ, యర్రంశెట్టి బాబ్జి, ముసిరెడ్డి నాగేశ్వరరావు, పైడిపాల సూరిబాబు, చాగంటి వీర వెంకట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️