టిడిపిలో చేరిన వైసిపి జడ్‌పిటిసి

Mar 13,2024 23:31
మండల జడ్‌పిటిసి, వైసిపి

ప్రజాశక్తి – గండేపల్లి

మండల జడ్‌పిటిసి, వైసిపి నాయకులు పరిమి మంగతాయారు, ఆమె భర్త పరిమి బాబు వారి అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. బుధవారం మండలం లోని ఎన్‌టి రాజాపురం గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. జడ్‌పిటిసి స్వగ్రామ మైన ఎన్‌టి రాజాపురంకు టిడిపి రాష్ట్ర ఉపాధ్యాక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి జడ్‌పిటిసి ఆధ్వర్యంలో వారి అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిక్కిన గంగాధర్‌, పరిమిరాజు, సుంకవిల్లి రమేష్‌, తదితరులతో కలిసి వారు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా పరిమి బాబు మాట్లాడుతూ అభివీద్ధి ప్రధాత జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి మళ్లీ ఈ పార్టీలో చేరుతున్నానని అన్నారు. నెహ్రూ మాట్లాడుతూ నా మిత్రులందరికీ ఈ మూడు నెలల కాలం నుంచి మళ్లీ నా వద్దకు వస్తున్నారని, ఇంకా అనేకమంది రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. విధ్వంసకర పాలన చేస్తున్న జగన్‌రెడ్డిని గద్దె దించటానికి ఈరోజు టిడిపి, జనసేన, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్‌విఎస్‌ఎస్‌.అప్పలరాజు, పోతుల మోహనరావు, తోట గాంధీ, తోట రవి, కోర్పు సాయితేజ, మారిశెట్టి భద్రం, జాస్తి వసంత్‌, కొత్త కొండబాబు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️