ప్రశాంతంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు

Mar 1,2024 22:45
ప్రశాంతంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ప్రజాశక్తి – సామర్లకోట, రౌతులపూడి, పిఠాపురంఇంటర్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమాయ్యాయి. సామర్లకోటలో పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రగతి కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉండగా మెదటి ఇంటర్‌ విద్యార్డులు పరీక్ష రాశారు. సామర్లకోటలో రెండు పరీక్ష కేంద్రాలు మాత్రమే ఇవ్వగా జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు గదులు సరిపడక పోవడంతో చెంతనే ఉన్న జిల్లా పరిషత్‌ బాలికొన్నత పాఠశాల తరగతి గదులను అధికారులు ఇంటర్‌ పరీక్షలకు ఉపయోగించారు. మరో 415 మందితో ప్రగతి కళాశాలలో రెండో పరీక్ష కేంద్రం నిర్వహించారు. రౌతులపూడి మండలంలోని ఎ.మల్లవరంని సాంఘిక సంక్షేమ జూనియర్‌ కళాశాలలో 364 మంది విద్యార్థులకు 27 మంది హాజరు కాలేదని సిఎస్‌ వను జోగరాజు తెలిపారు.పిఠాపురం పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో 1,037 మంది విద్యార్థులకు 1,007 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలతో పాటు వైద్య సదుపాయం కూడా అధికారులు ఏర్పాటు చేశారు.జగ్గంపేట స్థానిక బాలయోగి గురుకులం బాలికల పాఠశాల, అక్షర కాలేజ్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులను బస్సుల్లో జూనియర్‌ కళాశాల, అక్షర కళాశాల సెంటర్స్‌కు చేర్చారు.

➡️