బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

Jan 24,2024 22:55
నిజం గెలవాలి కార్యక్రమంలో

ప్రజాశక్తి – యంత్రాంగం

నిజం గెలవాలి కార్యక్రమంలో భాగం గా బుధవారం మాజీ సిఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరం కాకినాడ జిల్లాలో పర్యటించారు. తొలుత మధురపూడి విమానా శాయానికి వచ్చిన ఆమెకు టిడిపి నేతలు కెఎస్‌.జవహార్‌, ఆదిరెడ్డి వాసు, జ్యోతుల నవీన్‌, జిఎంసి హరీష్‌ మాథూర్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. గండేపల్లి( జగ్గంపేట రూరల్‌) మండలంలో గుర్రంపాలెం గ్రామానికి చెందిన పడాల వీరబాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వీరబాబు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. వీరబాబు పిల్లలను ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా విద్యను అందించేందుకు చర్యలు తీసుకుం టానని హామీ ఇచ్చారు. అలాగే గండేపల్లి మండలం టిడిపి అధ్యక్షుడు పోతుల మోహనరావు వ్యక్తిగతంగా రూ.10 వేలను వీరబాబు కుటుం బానికి అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌విఎస్‌ అప్పలరాజు, దాసరి తమ్మన్నదొర, జ్యోతుల లక్ష్మిదేవి, మారిశెట్టి భద్రం, మంగరౌతు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం మండలం లోని కాండ్రకోట గ్రామానికి చేరుకున్న ఆమె బుద్దాల సుబ్బారావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ 3 లక్షల చెక్కు ను సుబ్బారావు కుటుంబీకులకు అంద జేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ నిమ్మ కాయల చిన్న రాజప్ప, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, ఎలిశెట్టి నాని, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ స్థానిక 26వ వార్డుకు చెందిన కాకినాడ నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి కుటుంబ సభ్యులు చిక్కాల రామచంద్రరావు, నాగ సాయిలక్ష్మి, మనోజ్‌ కుమార్‌, అలేఖ్య తదితరులను ఆమె పరామర్శించారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎంఎల్‌ఎలు వనమాడి కొండబాబు, పిల్లి అనం తలక్ష్మి, పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. కోటనందూరు తుని రూరల్‌ ప్రాంతమైన యర్ర కొనేరు గ్రామానికి చెందిన ఇంజరుపు నూకరాజు కుటుంబ సభ్యు లను ఆమె పరామర్శించారు. మృతిని చిత్ర పటానికి పూలదండ వేసే నివాళులర్పించారు. కుటుంబానికి పార్టీ అండదండలుగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తుని నియోజ కవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్‌్‌ యనమల దివ్య, టిడిపి నాయ కులు యనమల కృష్ణుడు, పిఠాపురం నియోజక వర్గం ఇన్‌ఛార్జ్‌ ఎస్‌విఎస్‌ఎస్‌.వర్మ, తదితరులు పాల్గొన్నారు.

భువనేశ్వరిని కలిసేందుకు పోటీ

నిజం గెలవాలి కార్యక్రమానికి వచ్చిన భువనేశ్వరిని కలిసేందుకు పార్టీ కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో పెద్దఎత్తున తరలివచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చారు. భువనమ్మా…మీకు మేమున్నాం …ధైర్యంగా ఉండండి అంటూ మహిళలు పెద్ద ఎత్తున స్పందించడం గమనార్హం. పురుషులను పక్కకు నెట్టి మరీ మహిళలు ముందు వరుసలోకి వచ్చి భువనమ్మతో కరచాలనం చేసి సంఘీభావం తెలిపేందుకు పోటీ పడ్డారు.

➡️