వ్యవసాయ విద్యార్థులకు శిక్షణ

Feb 8,2024 23:05
స్థానిక వెంకటేశ్వర రైస్‌ ఇండ స్ట్రీస్‌లో

ప్రజాశక్తి – పెద్దాపురం

స్థానిక వెంకటేశ్వర రైస్‌ ఇండ స్ట్రీస్‌లో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యా ర్థులకు వరి నుంచి తయా రయ్యే బియ్యం, నూక, ఇడ్లీనూక, ఉప్పుడు బియ్యం వంటి ఆహార ఉత్ప త్తుల తయారీపై శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ చవాన్‌ శ్యామ్‌రాజ్‌నాయక్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం శిక్షణ తీరును పరిశీలించారు. ఈ సం దర్భంగా చవాన్‌ శ్యామ్‌రాజ్‌నాయక్‌ మాట్లాడుతూ ఈ పరిశ్రమ ద్వారా బియ్యం, బియ్యం నుంచి తయారయ్యే ఆహార ఉత్పత్తులు భారీ స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఈ ఆహార ఉత్పత్తుల తయారీ ప్రక్రియపై వ్యవసాయ విద్యా ర్థులకు ప్రయోగాత్మకంగా శిక్షణ ఇస్తున్నట్లు చె ప్పారు. పరిశ్రమ యాజమాన్యం ఇంటర్న్‌ షిప్‌ ధృవీకరణ పత్రాలను కూడా అంద చేస్తాదన్నారు. వెంకటేశ్వర రైస్‌ ఇండిస్టీస్‌ డైరెక్టర్‌ బి.శ్రీరామ్‌ మాట్లాడుతూ రైస్‌ ప్రాసెసింగ్‌లో ఆధునిక శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తు న్నామన్నారు.ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌ సిహెచ్‌ వి నరసింహారావు మాట్లాడుతూ రైస్‌ మిల్లు యాజమాన్యం లాభాపేక్షకు పరిమితం కాకుండా వరి పండించే రైతులు ఆర్థిక పురోభివృద్ధి సాధించేలా వ్యవసాయానికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. డాక్టర్‌ టి ఉషారాణి, డాక్టర్‌ కె.విజరు కుమార్‌ విద్యార్థులకు మార్గదర్శికాలను వివరించారు.

➡️