శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి

Mar 6,2024 23:45
స్థానిక భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి

ప్రజాశక్తి – సామర్లకోట

స్థానిక భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్స వాల ఏర్పాట్లు పూర్తి చేసి నట్లు ఇఒ నీలకంఠం తెలి పారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సవ ూవేశంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి ఉత్సవాలను అంకురార్పణ పూజా లతో ఘనంగా ప్రారం భించినట్టు చెప్పారు. శివరాత్రి పర్వదినం సంద ర్భంగా దర్శ నానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసి నట్టు చెప్పారు. ఆ ఒక్కరోజు దర్శనానికి లక్షమందికి పైగా భక్తు లు చేరుకునే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గట్టుగా అల్పా హారం, మజ్జిగ, పాలు, మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత సేవా కార్య క్రమాలు జరుగు తాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్‌లు, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, విఐపి దర్శనాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 9వ తేదీన జరిగే స్వామీ రధోత్స వానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్నానం ఘట్టాలు, ఆలయ పుసకారిణిల వద్ద గజ ఈత గాళ్ళను నియమించామని చెప్పారు. డిఎస్‌పి లతా కుమారి ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు, మున్సి పల్‌ కమిషనర్‌ జె రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ, ఇంకా రెవిన్యూ, వైద్య ఆరోగ్య శాఖ సేవలను, వాలం టరీ ఆర్గనైజేషన్‌ సేవలు అందుబాటులో ఉంచుతున్నట్టు నీలకంఠం వెల్లడించారు.

➡️