16న బంద్‌, పారిశ్రామిక సమ్మె

Feb 11,2024 22:17
16న బంద్‌, పారిశ్రామిక సమ్మె

ప్రజాశక్తి-కాకినాడ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న గ్రామీణ భారత బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆదివారం ఎఐటియుసి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో 14 మండలాల్లో 100 గ్రామాల్లో కరపత్రాలు పంచేందుకు ఆదివారం శాంతినగర్‌ నుంచి సైకిల్‌ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీని మధు ప్రారంభించారు. ర్యాలీలో తాటిపాక మధు, ఎఐటియుఐసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మాట్లాడారు. నరేంద్ర మోడీ వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్‌, అటవీ సంపదలు, రవాణా బ్యాంకులు, ఎల్‌ఐసి తదితర సంస్థలన్నీటిని అదానీ, అంబానీ తదితర కార్పొరేట్‌ కంపెనీలకు అప్పనంగా అప్ప చెబుతున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని చెప్పి కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు కోడ్‌లు తెచ్చారని విమర్శించారు. రైతాంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినా మరొక రూపంలో వాటి అమలుకు ప్రణాళిక వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయలేదని, ప్రత్యేక హోదా నిరాక రించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నవరం రామయ్య, శ్రీనివాసరావు, అప్పలరాజు, రమేష్‌, నాగయ్య పాల్గొన్నారు.

➡️