35వ రోజుకు శానిటేషన్‌ వర్కర్స్‌ ఆందోళన

Mar 9,2024 23:27
కాకినాడ ప్రభుత్వ సామాన్య

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన శనివారం నాటికి 35వ రోజుకు చేరింది. ఆసుపత్రి మాతా శిశు విభాగం వద్ద నుంచి ఒపి విభాగం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షుడు సిహెచ్‌. విజరుకుమార్‌, కమిటీ సభ్యు రాలు సిహెచ్‌.పుష్ప మాట్లాడుతూ తమ కష్టం అందరికీ తెలిసిందేనని, అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విఠల్‌ జోక్యంతో కాంట్రా క్టర్స్‌ తమతో చర్చలు జరిపారని తెలిపారు. అయితే పిఎఫ్‌ ఖాతాకు చెల్లించాల్సిన రూ.1600 ల్లో కేవలం రూ.600 మాత్రమే చెల్లించేందుకు ముందుకు వచ్చా రని, ఇది తమకు అంగీకారం కాదన్నారు. చట్ట ప్రకా రం కాంట్రాక్టర్‌ చెల్లించాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ సొమ్ము ను పూర్తిగా కాంట్రాక్టర్‌ చెల్లించాల్సిందేనని, అప్పటి వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసే లక్ష్యంలో భాగంగా ఎమర్జెన్సీ సేవలు మినహాయించి కార్మికులు సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు తెలి పారు. ఈ సందర్భంగా జిజిహెచ్‌ మెస్‌ వర్కర్స్‌ యూ నియన్‌ నాయకులు ఏసూరి శ్రీను, జిఎస్‌ఆర్‌.కృష్ణ, యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి జిఎస్‌.నాయుడు, పోర్ట్‌ సర్వే అండ్‌ టాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాలిక రాజేంద్రప్రసాద్‌ జిజిహెచ్‌ శానిటేషన్‌ కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ కార్య క్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, యూనియన్‌ నాయకులు జె.శేషు, ఆర్‌.రమేష్‌, ఎస్‌.వాసు, దుర్గాప్రసాద్‌, ఎం.రవి పాల్గొన్నారు.

➡️