రూ.1.38 లక్షల నగదు స్వాధీనం

Apr 5,2024 23:15
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో

ప్రజాశక్తి – పెద్దాపురం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం స్థానిక పాండవుల మెట్ట సమీపంలోని గుర్రాల సెంటర్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నిర్వహించిన తనిఖీల్లో రూ.1,38,800 నగదును స్వాధీనం చేసుకున్నారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్‌డిఒ జె.సీతారామారావు తెలిపారు. ప్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి, హౌసింగ్‌ ఇఇ కె.వెంకటరాజ గుప్తా ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ తనిఖీల్లో లభించిన నగదుకు సంబంధించి సంబంధిత వాహనదారుని వద్ద సరైన పత్రాలు చూపిం చకపోవడంతో నగదును సీజ్‌ చేసి కాకినాడ ట్రెజరీకి జమ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లేవారు సరైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు.

➡️