ఆదిత్యలో ఉత్సాహంగా ముగిసిన ఎన్‌సిసి క్యాంపు

Jun 18,2024 22:52
సూరంపాలెం ఆదిత్యలో గత

ప్రజాశక్తి – గండేపల్లి

సూరంపాలెం ఆదిత్యలో గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఎన్‌సిసి క్యాంప్‌ మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో మంగళవారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 480 మంది విద్యా ర్థులకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, 3వ గర్ల్స్‌ బెటాలియన్‌ కల్నాల్‌ దుష్యంత్‌ కుల్‌ శ్రేష్ఠ ఆధ్వర్యంలో ఎన్‌సిసి క్యాంపు జరిగింది. ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్‌ అందచేశారు. వివిధ రకాల ఉద్యోగాల్లో, కళాశాల అడ్మిషన్లులో ప్రాధాన్యత కల్పించారు. ఈ క్యాంపు విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన ఆదిత్య యూనివర్సిటీ ప్రో ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎన్‌.సతీష్‌రెడ్డి, డిప్యూటీ ప్రో వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డికి ఆదిత్య ఎన్‌సిసి ఇన్‌స్ట్రక్టర్‌ డి.నవీన్‌కుమార్‌, క్యాంపస్‌ ఇన్‌ఛార్జ్‌ జి.హరీష్‌చంద్రరెడ్డికి సంబంధిత విభాగపు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

➡️