పింఛన్ల పంపిణీపై ప్రత్యేక దృష్టి: జెసి

Jun 30,2024 22:26
భరోసా పింఛన్‌ పంపిణీ ప్రక్రియపై

ప్రజాశక్తి – కాకినాడ

జిల్లాలో జూలై 1న ఎన్‌టిఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీ ప్రక్రియపై అధికారులంతా ప్రత్యేక దృష్టి సారించాలని జెసి ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి ఆదే శించారు. ఆదివారం కలెక్టరేట్‌లో పింఛన్ల పంపిణీ ప్రక్రి యకు అనుసరించాల్సిన విధా నాలపై డిఆర్‌డిఎ, మెప్మా అధికారులతో సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో వివిధ రకాల పిం ఛన్ల కింద 2,79,319 మందికి రూ.188.40 కోట్లను పంపిణీ చేయనున్నట్లు తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి నెలకు రూ.వెయ్యి చొప్పున మూడు నెలలకు రూ.3 వేలు, నూతనంగా పెంచిన పింఛన్‌ సొమ్ము రూ.4 వేలు కలిపి మొత్తం మొత్తం రూ.7వేలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామ, వార్డు సచివా లయాల ఉద్యోగులే పింఛన్‌ దారులకు ఇంటి వద్దే అందచేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, డిఎల్‌డిఒ పి.నారాయణమూర్తి, విఒలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️