టిడిపి జెండాను ఆవిష్కరించిన చిన్న రాజప్ప

Mar 29,2024 16:24 #Kakinada

ప్రజాశక్తి – సామర్లకోట : ఇచ్చిన మాటకు కట్టుబడి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం టిడిపితోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ పోలీట్ బ్యూరోసభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా గల టిడిపి కార్యాలయం వద్ద శుక్రవారం టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజప్ప తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయమును రిబ్బన్ కత్తిరించి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం పేరుతో సీఎం జగన్ చేసిన మోసాలను వివరించాలని అలాగే సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టణ టిడిపి కార్యదర్శి బడుగు శ్రీకాంత్ ను ఎమ్మెల్యే చినరాజప్ప ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, బలుసు వాసు, యార్లగడ్డ చిన్ని, గోలి సత్తిరాజు, గోల్తి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు కురుకూరి సోమేశ్వరరావు, అందుగుల జార్జ్ చక్రవర్తి, తాతపూడి కృష్ణ బాబు, కాపవరపు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️