మంత్రి సుభాష్‌ దృష్టికి కార్మికుల సమస్యలు

Jun 29,2024 23:48
దృష్టికి సిఐటియు బృందం

ప్రజాశక్తి – కాకినాడ

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్‌ దృష్టికి సిఐటియు బృందం కార్మికుల సమస్యలను తీసు కెళ్లింది. శనివారం రామచంద్రపురంలో మంత్రి స్వగృహంలో బృందం మర్యాదపూర్వకంగా కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే పునరుద్ధరించడం తోపాటు కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి సుభాష్‌ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. పరిశ్రమలలో కార్మికులను తొలగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తానని, ఏ ఒక్క కార్మికుణ్ణి తొలగించినా ఊరుకునేది లేదని, చట్ట వ్యతిరేక తొలగింపులకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారన్నారు. అసంఘటిత కార్మికులకు వైసిపి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, దాన్ని సరిచేస్తూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించి కార్మికుల కుటుంబాలను ఆదుకుం టామని తెలిపారన్నారు. త్వరలో జరగబోయే మొదటి క్యాబినెట్‌ మంత్రుల సమావేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరిస్తూ నిర్ణయం చేయబోతున్నామని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతికుమార్‌, రాక్‌ సిరామిక్‌ కార్మికులు చంద్రశేఖర్‌, గంగాధర్‌, మంగారవు, మల్లిఖార్జున, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️