డిప్యూటీ సిఎం పర్యటనకు ఏర్పాట్లు : కలెక్టర్‌

Jun 29,2024 23:46
.పవన్‌కళ్యాణ్‌ జూలై 1 నుంచి 3

ప్రజాశక్తి – కాకినాడ

రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.పవన్‌కళ్యాణ్‌ జూలై 1 నుంచి 3 రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారని, కావున అవస రమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఆదేశించారు. శని వారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జూలై 1 నుంచి 3వ తేదీ వరకూ పిఠాపురం నియోజకవర్గంలోను, కాకినాడలోను పర్యటిస్తారని తెలిపారు. జూలై 1వ తేదీన గొల్లప్రోలు చేరుకుని, ఉదయం 10 గంటల నుంచి 12-30 గంటల వరకూ విల్లాస్‌ సత్యకృష్ణ కన్వెన్స్‌ హాలులో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్య క్రమ నిర్వహణకు అవసరమైన ప్రణాళిక, ఏర్పా ట్లను చేపట్టాలని డిఆర్‌డిఎ పీడీకి సూచించారు. జూలై 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకూ డ్వామా, పంచాయితీరాజ్‌, ఇరిగేషన్‌, ఫారెస్ట్‌, ఆర్‌ అండ్‌ బి, ఆర్‌ డబ్ల్యూఎస్‌, జడ్‌పి, పర్యావరణ శాఖల అధికారులతో శాఖల వారీగా సమీక్షిస్తారని తెలిపారు. ఈ సమీక్షకు ఆయా శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. జూలై 3 వ తేదీ ఉదయం 10-45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉప్పాడ తీరంలో సముద్ర కోతకు గురైన ప్రాంతాలను సంద ర్శించి, తీర ప్రాంత రక్షణకు చేపట్టవలసిన చర్యలపై అధికారులు, నిపుణులతో చర్చిస్తారన్నారు. ఉప్పాడ తీరం పూర్వం ఏవిధంగా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉన్నది వివరించేందుకు ఛాయాచిత్రాలు, మాప్‌లను సందర్శన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని సూచిం చారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో నియోజక వర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసేం దుకు ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారని, సభా ప్రాంతంలో ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజలకు తాగునీరు, ఆంబులెన్సులు తదితర ఏర్పాట్లను చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో ఈ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, డిఆర్‌ఒ డాక్టర్‌ కె.తిప్పేనాయక్‌, డిఆర్‌డిఎ పీడీ శ్రీ రమణి, డిపిఓ కె.భారతి సౌజన్య, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, జడ్‌పి సిఇఒ శ్రీరామచంద్రమూర్తి, డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ జె.నరశింహనాయక్‌, డిఐపిఆర్‌ డి.నాగార్జున, ఆర్‌డిఒలు ఇట్ల కిషోర్‌, జె.సీతారామారావు, డిఎల్‌డిఒ కాకినాడ పి.నారాయణమూర్తి పాల్గొన్నారు.

➡️