గురుకుల విద్యార్థికి అభినందన

Apr 23,2024 22:30
మండలంలోని చొల్లంగిపేట

ప్రజాశక్తి – తాళ్లరేవు

మండలంలోని చొల్లంగిపేట డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠ శాలలో 10వ తరగతి ఫలి తాల్లో 565 మార్కులు సాధిం చిన విద్యార్తిని గోవలంక గ్రామానికి చెరందిన కూరాటి పూర్ణ షర్మిలను పలువురు అభినం దించారు. స్థానిక ఎంపిటిసి సభ్యులు మోర్తా బీమా బాయి, కో – ఆప్షన్‌ సభ్యులు కురాటి శ్రీకృష్ణ, వైసిపి నాయకులు పెంకే అర్జున్‌, విద్యార్థిని తాతయ్య, నాన్నమ్మలు నరసిం హమూర్తి, రాజమ్మలు విద్యార్థిని షర్మిలను అభినందించి సాలువాతో సత్క రించారు. ఉన్నత చదువుల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూ రాటి వాసు, భాగ్యలక్ష్మి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️