పల్లెల్లో కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం

May 4,2024 22:57
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌

ప్రజాశక్తి – ఏలేశ్వరం

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసీ గెలిపించాలని గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. శనివారం మండలం లోని మర్రివీడు, తూర్పు లక్ష్మీపురం, జె.అన్నవరం గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ, కార్యకర్తలతో కలిసి మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశ పరిరక్షణ, సమగ్రత సాధ్యమవుతుందన్నారు. కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు, ప్రత్తిపాడు అసెంబ్లీకి నన్ను హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మొయ్యేటి సూర్య ప్రకాశరావు, కొప్పన కోటేశ్వరరావు, కరణం శ్రీనివాస్‌, మొయ్యేటి నారాయణ, తాతపూడి జార్జి రాజు, మహిళా కార్యకర్తలు ఉన్నారు.

➡️