ఘనంగా దొరబాబు పుట్టినరోజు వేడుక

Apr 17,2024 22:41
వైసిపి పెద్దాపురం నియో

ప్రజాశక్తి – సామర్లకోట

వైసిపి పెద్దాపురం నియో జకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకూ నియోజక వర్గ పరిధిలోని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దొర బాబును కలిసి పూలమాలలతో సత్క రించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేకులను కోయించి దొరబాబుకు తినిపించి వేడుకలు జరిపారు. ఈ వేడు కల్లో నాయకులు దవులూరి సుబ్బారావు, ఆవాల రాజేశ్వరిలక్ష్మి, గంగిరెడ్డి అరుణ, బొడ్డు తులసి మంగతాయారు, వైస్‌ ఛైర్మన్‌లు ఊబా జాన్‌ మోసెస్‌, నెక్కంటి సాయిప్రసాద్‌పాల్గొన్నారు.

➡️