పోలింగ్ స్టేషన్లు సందర్శించిన ఈఆర్ఓ

Feb 12,2024 15:56 #Kakinada
ERO visited polling stations

 మౌళిక వసతుల పరిశీలన

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో,నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు సోమవారం పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. గాంధీ నగర్, ప్రతాప్ నగర్, శ్రీరామ్నగర్, గుడారిగుంట, శంతనపురి కాలనీ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లలో కనీస మౌలిక వసతులు ఉన్నాయో, లేదో పరిశీలించారు. మంచినీరు, విద్యుత్, ఫర్నిచర్, ర్యాంప్ వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. మౌలిక సదుపాయాల కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఈఆర్ఓ వెంకటరావు ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూపర్వైజర్లు, బి ఎల్ ఓ లు ఉన్నారు.

➡️